బీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 

– అభివృద్ధి పనులు కొనసాగించకపోతే నిరసనలు తప్పవు
నవతెలంగాణ – చండూరు
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనంత మాత్రాన కార్యకర్తలు నిరుత్సవ పడుతుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ జడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీలను , చైర్మన్ లను పూల మాలలు వేసి శాలువాలు కప్పి జ్ఞాపకాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటుందని, నిరుత్సాహానికి లోన్ కావొద్దు అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బిఆర్ఎస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందని, నేడు గ్రామాల్లో సిసి రోడ్లు గాని, చెరువుల పునరుద్వీకరణ గాని, నేడు తెలంగాణ రాష్ట్రాన్ని దాండియాబండాగారంగా నిలిపింది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం 572 కోట్ల రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి పనులను చేపడితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెడు ఉద్దేశంతో కమిషన్ల కోసం పనులు ఆపుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పది రోజుల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టకపోతే ధర్నా కార్యక్రమాలు నిరసనలు వ్యక్తం చేసే కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతి రెడ్డి,   మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం మాజీ ఎంపీపీ అవారి గీతా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ గుర్రం మాధవి వెంకటరెడ్డి, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న , కొత్తపాటి సతీష్, ఎంపీటీసీలు గొరిగె  సత్తయ్య, చెరుపల్లి భాస్కర్, కావలి మంగమ్మ ప్రసాద్, పెందుర్తి వెంకటమ్మ, సర్పంచులు మెండు ద్రౌపత్తమ్మ వెంకటరెడ్డి ఇడెం రోజా, పంకేర్ల పద్మ,  నాయకులు  ఉజ్జిని అనిల్ రావు, మధుసూదన్ రావు, బోడ్డు సతీష్ , కురపాటి సుదర్శన్ పాల్గొన్నారు.