
నవతెలంగాణ – అశ్వారావుపేట
మార్చి మూడు,నాలుగు,ఐదు తేదీల్లో ఖమ్మం లో జరిగే మూడు విప్లవ పార్టీల ఐక్యతా మహాసభ,బహిరంగ సభ ను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) జిల్లా నాయకులు గోకినపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు. శనివారం ఆ సభకు సంబంధించిన పోస్టర్లు ను స్థానిక కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రభాకర్ మాట్లాడుతూ నేడు భారతదేశంలో ఫాసిస్టు ప్రమాదం పెరుగుతుందని,ఈ తరుణంలో విప్లవకారులంతా ఐక్యంగా పోరాడాలని అలాగే మార్చి మూడు, నాలుగు , ఐదు తేదీలలో ఖమ్మం లో జరుగుతున్న మూడు విప్లవ పార్టీల ఐక్యతా మహాసభకు, బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు ప్రచారం, నిర్మాణం ,ఫండ్స్ సేకరణలో కృషిని కొనసాగించాలని అలాగే మార్చి మూడు న ఖమ్మం లో జరిగే బహిరంగ సభకు అశ్వారావుపేట మండలం నుండి ప్రజలను కదిలించి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.దేశంలో ధనవంతులు పెరుగుతున్నారని, వ్యవసాయం రంగంలో మార్పులు వస్తున్నాయని మారిన పరిస్థితులను అర్థం చేసుకోని విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకోవాల్సిన విప్లవ కారులు కాలం చెల్లిన పాత విధానాలని అనుసరించటం వల్లన ప్రజలకు దూరమవుతున్నారు అని వాపోయారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్( ప్రజా పంథా) భద్రాద్రి కొత్త గూడెం జిల్లా నాయకుడు కంగాల కల్లయ్య, అశ్వారావుపేట మండల కార్యదర్శి వాసం బుచ్చి రాజు, కన్నాయిగూడెం సర్పంచ్ గొంది లక్ష్మణ్ రావు, రైతు సంఘం జిల్లా నాయకుడు కంగాల కన్నయ్య, అరుణోదయ మండల నాయకుడు కంగాల చిన్న వంగరావు తదితరులు పాల్గొన్నారు.