ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రానికి ”రాజా సాబ్” అనే టైటిల్‌ని మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ను సంక్రాంతి కానుకగా మంగళవారం అనౌన్స్ చేశారు. మోస్ట్ అవేటెడ్ మూవీగా ప్రభాస్ ఫ్యాన్స్, ఫిల్మ్ లవర్స్ దీని కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాత. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హర్రర్ జోనర్‌లో ఈ సినిమాను మారుతి రూపొందిస్తుండటంతో అందరిలోనూ అమితాసక్తి కలుగుతోంది. ”రాజా సాబ్” ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ ఫుల్‌గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో వింటేజ్ లుక్‌లో, లుంగీ కట్టుకున్న ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. సరదాగా, రొమాంటిక్‌గా సాగే క్యారెక్టర్ లుక్‌లో ప్రభాస్‌ను చూడటం అభిమానులతో పాటు ప్రేక్షకులందరికీ ఫ్రెష్ ఫీల్ కలిగిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే ఒక కలర్ ఫుల్ సినిమా చూడబోతున్నామనే ఇంప్రెషన్ కలిగించారు దర్శకుడు మారుతి. దీంతో ప్రభాస్‌ను కొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం అందరిలో ఏర్పడుతోంది. ‘ధమాకా, కార్తికేయ 2’ వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌గా ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమా తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ఈచిత్రానికి ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని, మ్యూజిక్ – తమన్, ఫైట్ మాస్టర్ – కింగ్ సోలొమన్, వీఎఎఫ్‌ఎక్స్ – ఆర్.సి. కమల్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – డా.వాసుదేవ లెంబూరు, ప్రొడక్షన్ కంట్రోలర్ – యోగానంద్ దుద్దుకూరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్‌కేఎన్, కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల, ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్, రచన, దర్శకత్వం – మారుతి.