నా కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదు – ప్రభాస్‌

నా కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదు - ప్రభాస్‌ప్రభాస్‌, ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌ సీజ్‌ ఫైర్‌’. హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ లేటెస్ట్‌ భారీ యాక్షన్‌ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ గురించి ప్రభాస్‌ పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాకి తెలిపారు. ఇందులో పాత్రల మధ్య చక్కటి ఎమోషన్స్‌ ఉంటాయి. ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడనటు వంటి పాత్రలో నన్ను చూస్తారు.నా కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదు. నేను, ప్రశాంత్‌ నీల్‌ కలిసి పని చేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే అందరినీ ఆకట్టుకుంటుందనే విషయాలపై బాగా చర్చించాం. నా ఆలోచనలను ఆయన ముందు పెట్టాను. వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్‌ నీల్‌ కథని అద్భుతంగా తయారు చేశారు. అలాగే మేం అనుకున్న కథకు బాడీ లాంగ్వేజ్‌ కూడా ఎలా ఉండాలనే విషయాన్ని డిస్కస్‌ చేశాం. నా సినీ జర్నీని ప్రారంభమై 21 ఏళ్లు అవుతున్నాయి. అయితే ప్రశాంత్‌నీల్‌తో ఎప్పుడు షూటింగ్‌ చేస్తానా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ప్రశాంత్‌ హీరోలను గొప్పగా చూపించాలనుకునే దర్శకుడు. నాతో పాటు శ్రుతీ హాసన్‌, పథ్వీరాజ్‌, జగపతిబాబు ఇలా అందరం సెట్స్‌లో చాలా సరదాగా గడిపాం.
ఈ సినిమాలో నా పాత్ర కోసం నేనేం ప్రత్యేకంగా కష్టపడలేదు. క్యారెక్టర్‌ డిమాండ్‌ మేరకు కండలు పెంచాను. ‘సలార్‌ సీజ్‌ ఫైర్‌’లో రెండు ప్రధాన పాత్రల మధ్య చక్కటి సోదర భావాన్ని ప్రేక్షకులు చూస్తారు. క్రిస్మస్‌ సీజన్‌లో హౌంబలే సంస్థ ఆడియెన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మీ అందర్నీ సినిమా కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం.