– ‘అరిబండిలక్ష్మినారాయణ’పై 5వ స్మారకోపన్యాసం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ రైతు సంఘం, అరిబండి పౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. ‘మారుతున్న ప్రపంచం- వాతావరణ పరిస్థితులు, జాతీయ వ్యవసాయ విధానం’ అనే అంశంపై అరిబండి లక్ష్మినారాయణపై 5వ స్మారకోపన్యాసం చేయనున్నారు. ఈమేరకు ఆదివారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, అరిబండి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టు డాక్టర్ అరిబండి ప్రసాదరావు ఒక ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్ఞు కృష్ణన్ ప్రసగించనున్నారు. ‘వానాకాలం సాగు’పై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అగ్రికల్చర్ మేనేజ్‌మెంటు డైరెక్టర్ జువ్వాడి దేవీప్రసాద్, అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అల్టాఫ్ జానయ్య, ఏఐకేఎస్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు -వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల అంశంపై ప్రముఖంగా చర్చిస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని పేర్కొన్నారు. సెమినార్‌ను జయప్రదం చేయాలంటూ రైతాంగానికి పిలుపునిచ్చారు.