నవతెలంగాణ – రుద్రంగి
జన్మనిచ్చిన గడ్డ రుణం తీర్చుకుంటు న్నానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.రుద్రంగి మండలంలో కోటి 97 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి పాల్గొన్నారు.ఇట్టి సభకు పెద్ద ఎత్తున మహిళలు గ్రామ ప్రజలు తరలివచ్చారు.వారిని ఉద్దేశించి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.రుద్రంగి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యే గా తనకు అవకాశం కలిపించిన నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.నియోజకవర్గ అభివృద్ధికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న మహిళ సంఘ భవనంలో తహశీల్దార్ ఆఫీస్ కొనసాగుతుందని మరొక భవనం కావాలని మహిళ తల్లులు కొరగానే మంజూరు చేయడం జరిగిందని అన్నారు.తను ఎమ్మెల్యే గా గెలిచిన నుండి నియోజకవర్గ అభివృద్ధికి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిధులు తీసుకువస్తు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నానని అన్నారు.సమస్య చెప్పడం మీ వంతు పరిష్కరించడం తనవంతని అన్నారు.ఈ కార్యక్రమంలో, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి,మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, డిసిసి కార్యదర్సులు,గడ్డం శ్రీనివాస్,తర్రె లింగం,గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,ఆలయ చైర్మన్ కొమిరె శంకర్,ఏఎంసి డైరెక్టర్ గోపీడి రవీందర్ రెడ్డి,నాయకులు పిడుగు లచ్చిరెడ్డి,పల్లి గంగాధర్,కట్కూరి దాసు,యాదయ్య, దయ్యాల రమేష్,అక్కేనాపెల్లి శ్రీనివాస్, పాల్గొన్నారు.