– సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదు
– సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మల్లేశం
నవతెలంగాణ-మెదక్
అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా సమ్మె జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధనలను ప్రయోగించి అంగన్వాడి టీచర్లు, హెల్పర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మల్లేశం అన్నారు. మెదక్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు సమ్మె చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని తొత్తు యజమాన్యాలను ప్రభుత్వం తయారుచేసుకొని వారితో తప్పుడు ప్రకటనలు ఇప్పించి.. అంగన్వాడి ఉద్యో గులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఉద్యోగులు మోసపూరిత మాటలను నమ్మొద్దని కోరారు. అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చాక అంగన్వాడి రంగంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలతో ఆగస్టు 17న మంత్రి సత్యవతి రాథోడ్ చర్చలు జరిపి కొన్ని అంగీకరించి నట్లు తెలిపారు. ఆ చర్చల్లో మంత్రి.. అంగన్వాడి విషయాల పై ప్రస్తావిస్తూ టీచర్లు రిటర్మెంట్ అయితే రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1 లక్ష చొప్పున బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి నట్లు తెలిపారు. కానీ అందుకు భిన్నంగా ఏకపక్ష నిర్ణయా లతో ప్రభుత్వం టీచర్లకు రూ. లక్ష, ఆయాలకు రూ.50 వేల చొప్పున బెనిఫిట్స్ అందజేస్తున్నట్లు జీవో విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. అలాగే రిటైర్మెంట్ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ జీవో జారి చేయడం జరిగిం దని, ఆన్లైన్ పని విధానం కూర్చొని రికార్డులు రాయడంతో అంగన్వాడీ ఉద్యోగులు అనేక బ్యాక్ పెయిన్, జబ్బుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్వాడీల సమస్య లు పరిష్కరించే వరకు ఉద్యోమం కొనసాగుతుందన్నారు. ఇప్పట ికైనా ప్రభుత్వం అంగన్వాడి యూనియన్ల తో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.