ఆ ఐదుగురికి ప్రగతి భవన్‌లో..మిగతా వారికి తెలంగాణ భవన్‌లో…

In Pragati Bhavan for those five..– మొత్తం 69 మందికి బీ-ఫామ్‌లు అందజేసిన కేసీఆర్‌
– మిగతా వారికి నేడు ఇస్తామన్న సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎన్నికలు తరుముకొస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదివారం మొత్తం 69 మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లను అందజేశారు. వీరిలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో వాటిని అందజేశారు. హుస్నాబాద్‌లో బహిరంగ సభ సందర్భంగా అక్కడి అభ్యర్థి సతీశ్‌ కుమార్‌కు బీ-ఫామ్‌ను అందించారు. వీరుగాక మిగిలిన వారికి సోమవారం వాటిని అందజేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్‌ చేతుల మీదుగా సీఎం కేసీఆర్‌ బీ-ఫామ్‌ను అందుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బీ-ఫామ్‌ను సీఎం కేసీఆర్‌… ఎమ్మెల్సీ కవితకు అందజేశారు. మరోవైపు నామినేషన్‌ను నింపేటప్పుడు, సమర్పించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం… అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ నాయకులపై గతంలో అనేక కేసులు నమోదైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటితో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయంలో ఇదే జరిగిందని గుర్తు చేశారు. అందువల్ల నామినేషన్‌ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలనీ, ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే న్యాయ బృందాన్ని సంప్రదించాలని సూచించారు. ఎన్నికల సమయంలో నేతల మధ్య కోపతాపాలు సహజమనీ, అందువల్ల ఓపిక, సహనంతో వ్యవహరించాలంటూ అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు, ప్రచార ఖర్చుకు సంబంధించి లెక్కలు పక్కాగా ఉండాలంటూ ఆయన ఆదేశించారు.
బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు…
1. కోనేరు కోనప్ప (సిర్పూర్‌)
2. దుర్గం చిన్నయ్య (బెల్లంపల్లి)
3. దివాకర్‌రావు (మంచిర్యాల)
4. కోవా లక్ష్మీ (ఆసిఫాబాద్‌)
5. భూక్య జాన్సన్‌ నాయక్‌ (ఖానాపూర్‌)
6. జోగు రామన్న (ఆదిలాబాద్‌)
7. అనిల్‌ జాదవ్‌ (బోధ్‌)
8. ఇంద్రకరణ్‌రెడి ్డ(నిర్మల్‌)
9. విఠల్‌ రెడ్డి (ముథోల్‌)
10. కె చంద్రశేఖర్‌రావు (గజ్వేల్‌)
11. మహ్మద్‌ షకీల్‌ (బోధన్‌)
12.హనుమంత్‌ షిండే (జుక్కల్‌)
13. పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ)
14. జే సురేందర్‌ (యల్లారెడ్డి)
15. బి గణేష్‌ గుప్తా (నిజామాబాద్‌ అర్బన్‌)
16. బాజిరెడ్డి గోవర్ధన్‌ (నిజామాబాద్‌ రూరల్‌)
17. వి ప్రశాంత్‌ రెడ్డి (బాల్కొండ)
18. పట్నం నరేందర్‌ రెడ్డి (కొడంగల్‌)
19. ఎస్‌ రాజేందర్‌ రెడ్డి (నారాయణపేట్‌)
20. డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి (జడ్చర్ల)
21. ఎ వెంకటేశ్వర్‌ రెడ్డి (దేవరకద్ర)
22. వి శ్రీనివాస్‌ గౌడ్‌ (మహబూబ్‌ నగర్‌)
23. సీహెచ్‌ రాంమోహన్‌ రెడ్డి (మక్తల్‌)
24. ఎస్‌ నిరంజన్‌ రెడ్డి (వనపర్తి)
25. బి కష్ణామోహన్‌ రెడ్డి (గద్వాల్‌)
26. మర్రి జనార్ధన్‌ రెడ్డి (నాగర్‌ కర్నూల్‌)
27. గువ్వల బాలరాజు (అచ్చంపేట)
28. జైపాల్‌ యాదవ్‌ (కల్వకుర్తి)
29. అంజయ్య యాదవ్‌ (షాద్‌ నగర్‌)
30. బి హర్షవర్ధన్‌ రెడ్డి (కల్లాపూర్‌)
31. పద్మాదేవేందర్‌ రెడ్డి (మెదక్‌)
32. ఎం భూపాల్‌ రెడ్డి (నారాయణఖేడ్‌)
33. చంటి క్రాంతి కిరణ్‌ (ఆంధోల్‌)
34. జి మహిపాల్‌ రెడ్డి (పటాన్‌ చెరువు)
35. కె ప్రభాకర్‌ రెడ్డి (దుబ్బాక)
36. రేగా కాంతారావు (పినపాక)
37. హరిప్రియ నాయక్‌ (ఇల్లందు)
38. పువ్వాడ అజయ్ కుమార్‌ (ఖమ్మం)
39. కె ఉపేందర్‌రెడ్డి (పాలేరు)
40. ఎల్‌ కమల్‌రాజ్‌ (మధిర)
41. బానోత్‌ మదన్‌ లాల్‌ (వైరా)
42. వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం)
43. సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి)
44. నాగేశ్వరరావు (అశ్వరావుపేట)
45. తెల్లం వెంకట్రావు (భద్రాచలం)
46. పైళ్ల శేఖర్‌ రెడ్డి (భువనగిరి)
47. కే తారక రామారావు (సిరిసిల్ల)
48. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి (జనగాం)
49. టి హరీష్‌ రావు (సిద్ధిపేట)
50. ఏజీవన్‌ రెడి ్డ(ఆర్మూర్‌)
51. బాల్క సుమన్‌ (చెన్నూరు)
52. సతీష్‌ కుమార్‌ (హుస్నాబాద్‌)
53. గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి (సూర్యాపేట)
54. రమావత్‌ రవీందర్‌ నాయక్‌ (దేవరకొండ)
55. బొల్లం మల్లయ్య యాదవ్‌ (కోదాడ)
56. కంచర్ల భూపాల్‌ రెడ్డి (నల్లగొండ)
57. నోముల భగత్‌ (నాగార్జున సాగర్‌)
58. కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి (మునుగోడు)
59. దాసరి మనోహర్‌ రెడ్డి (పెద్దపల్లి)
60. రసమయి బాలకిషన్‌ (మానకొండూరు)
61. దాస్యం వినయభాస్కర్‌ (వరంగల్‌ పశ్చిమ)
62. నన్నపనేని నరేందర్‌ (వరంగల్‌ తూర్పు)
63. పెద్ది సుదర్శన్‌ రెడ్డి (నర్పంపేట)
64. బడే నాగజ్యోతి (ములుగు)
65. అరికె పూడి గాంధీ (శేరిలింగంపల్లి)
66. పైలట్‌ రోహిత్‌ రెడ్డి (తాండూరు)
67. పాడి కౌశిక్‌ రెడ్డి (హుజూరాబాద్‌)
68. చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌)
69. గ్యాదరి కిశోర్‌ కుమార్‌ (తుంగతుర్తి)