గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగం గనా సూర్యవంశీ హీరో యిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంపై మీడియా, ఆడియెన్స్ ప్రశంసలు కురిపించింది.ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ, ‘సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్‌లకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెబుతున్నారు. నేను ఇంకెన్ని చిత్రాలు చేసినా నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది’ అని అన్నారు. ‘టీమ్ అందించిన సహకారంతోనే సినిమా ఇంత బాగా వచ్చింది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థ్యాంక్స్’ అని డైరెక్టర్ అప్సర్ చెప్పారు. నిర్మాత మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మా చిత్రాన్ని ఆడియెన్స్‌కు చేరువ చేసిన మీడియాకు, ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అభినందిస్తున్నారు’ అని తెలిపారు.