ప్రజా ఆశీర్వాద సభను విజయ వంతం చేయాలి

నవతెలంగాణ వీర్నపల్లి : వీర్నపల్లి మండలం గర్జన పల్లి, పలు గ్రామాల్లో బి అర్ ఎస్ పార్టి శ్రేణులు ఆదివారం ప్రజలతో సమావేశాలు నిర్వహించి ఈ నెల 17 న సిరిసిల్ల లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు మహిళలూ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయ వంతం చేయాలని బి అర్ ఎస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి, మహిళ అధ్యక్షురాలు కళా పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ చాంద్ పాషా, బంజార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, ఉప సర్పంచ్ రామస్వామి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజు, డైరెక్టర్ దేవ రాజు, సోసెల్ మీడియా కో ఆర్డినేటర్ చిరంజీవి, మండల సీనియర్ నాయకులు చంద్రం, రంజిత్, రఫీ, తిరుపతి నాయక్, ఆనందం, సుధీర్,మల్లేశం, చిరంజీవి, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.