డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ ఉత్తర్వులు జారీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే భవన్‌ ప్రగతి భవన్‌గా ఉండేది. అందులో మాజీ సీఎం కేసీఆర్‌ నివాసముండేవారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవటంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం… ఆ భవన్‌ను డిప్యూటీ సీఎంకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.