శతకాలు
శతకాలు సంస్కృత ప్రాకృత కన్నడాది భాషలలో వెలువడినప్పటికీ తెలుగు వాటికి ప్రత్యేకమైన స్థానమున్నది. తెలుగులో వేలకొలది శతకాలు వెలువడ్డాయి. సంస్కృత ప్రాకృత శతకాల్లో లేని సంఖ్యా నియమం, మకుట నియమం, ఛందోనియమం, రసనియమం, ఆత్మాశ్రయ కవితాధర్మం అనే లక్షణాలు తెలుగు శతకాలలో రూపు దిద్దుకొన్నాయి. తెలుగు శతకాలలో సామాన్యంగా 100కి బదులు 108 పద్యాలుంటాయి. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎక్కువగా వెలువడ్డాయి. క్రీ.శ.16వ శతాబ్దంలో ప్రబంధాల ప్రభావం వల్ల శృంగార శతకాలు కొందరు రచించారు. తెలుగులో శతక కవిత్వానికి ఆద్యుడిగా మల్లికార్జున పండితారాధ్యుడిని ప్రధమశతక కర్త అని చెప్పవచ్చు. కాని శతకానికి తగిన లక్షణాలు లేవు. ఇతడు రాసిన శివతత్త్వసారంలో 489 కంద పద్యాలున్నాయి. పాల్కురికి సోమనాథుడు రచించిన ‘వృషాధిప శతకము’ సర్వ లక్షణ సంపన్నమైన తొలి తెలుగు శతకం. తెలుగులో శతకాలు నీతి, భక్తి, వ్యాజస్తుతి, వేదాంత శతకాలని నాలుగు విధాలుగా డా|| దివాకర్ల వేంకటావధానిగారు విభజించి పరిశీలించారు. తెలుగులో తొలి శతక పరిశోధకుడు వంగూరి సుబ్బారావు.
సాధన ప్రశ్నలు
1. తొలి తెలుగు సమగ్ర శతకం రాసి, శతక బ్రహ్మ కీర్తి గాంచిన కవి, శతకం?
ఎ. శిశతత్త్వసారం – మల్లికార్జున పండితాధ్యుడు
బి. వృషాధిపశతకం – పాల్కురికి సోమన
సి. సర్వేశ్వర శతకం – యధావాక్కుల అన్నమయ్య
డి. సుమతి శతకం – బద్దెన
2. తొలి తెలుగు శతక మన దగిన ‘శివతత్త్వ సారం’ రాసిన మల్లికార్జున పండితరాద్యుడు అందులో వాడిన పద్యాలు?
ఎ. ఉత్పలమాల, చంపకమాల
బి. ఆటవెలది, తేటగీతి
సి. కందం డి. సీసం
3. ఈ క్రింది వానిలో పాల్కురికి సోమన రచన కానిది?
ఎ. చెన్నమల్లు సీసములు బి. బసవలింగ శతకం
సి. సర్వేశ్వర శతకం డి. చతుర్వేదసారం
4. పాల్కురికి సోమన ‘వృషాధిపశతకం’?
ఎ. వేదాంత శతకం బి. భక్తి శతకం
సి. వ్యాజస్తుతి శతకం డి. నీతి శతకం
5. రాజనీతి, గృహనీతి, సర్వజన సుబోధకంగా, సమయోచితంగా రచించిన నీతి శతకం ‘సుమతీ శతకం’ కర్త?
ఎ. బద్దెన బి. మారన సి. మారదవెంకయ్య డి. మంచన
6. శైవభక్తి శతకాల్లో అగ్రగణ్యమైన సమగ్ర శతకం?
ఎ. బసవ లింగ శతకం
బి. దాశరథీ శతకం
సి. భాస్కర శతకం
డి. శ్రీకాళహస్తీశ్వర శతకం
7. జతపర్చుము
1. పోతన అ. ఒంటి మిట్ట రఘువీరశతకం
2. అమ్యలరాజు తిప్పయ్య ఆ. వేంకటేశ్వర శతకం
3. వెన్నెలకంటి జన్నమంత్రి ఇ. నారాయణ శతకం
4. తాళ్లపాక పెద తిరుమలయ్య ఈ. దేవకీనందన శతకం 1 2 3 4
ఎ. అ ఇ ఈ ఆ
బి. ఇ అ ఈ ఆ
సి. ఇ ఈ అ ఆ
డి. ఇ ఈ ఆ అ
8. ‘సుమతీ శతకం’లో పద్యాలు…?
ఎ. ఆటవెలది బి. తేటగీతి సి. కందం డి. ఉత్పలమాల
9. పిఠాపురంలోని ‘కుక్కుటేశ్వరస్వామి’కి అంకితంగా ‘కుక్కుటేశ్వరశతకం’ (సీసపద్యాల్లో) రచించిన కవి?
ఎ. వరాహగిరికొండ రాజామాత్యుడు బి. కూచిమంచి తిమ్మకవి
సి. కూచిమంచి జగ్గకవి
డి. అడిదము సూరకవి
10. జతపర్చుము
1. కుమార శతకం అ. వేంకటనరసింహకవి
2. కుమారీ శతకం ఆ. నృసింహకవి
3. రామలింగేశ్వర శతకం ఇ. అయ్యానకోట పార్థసారధి
4. కృష్ణ శతకం ఈ. అడిదము సూరకవి
1 2 3 4
ఎ. ఇ అ ఈ ఆ
బి. ఈ అ ఇ ఆ
సి. అ ఇ ఈ ఆ
డి. ఆ అ ఈ ఇ
11. మారద వెంకయ్య రాసిన ‘భాస్కర శతకం’?
ఎ. శృంగార శతకం బి. వైరాగ్య శతకం
సి. భక్తి శతకం డి. నీతి శతకం
12. పాల్కురికి సోమన రాసిన వృషాధిపశతకంలో పద్యాలు?
ఎ. ఆటవెలది, తేటగీతి బి. కంద,సీసం
సి. చంపకమాల, ఉత్పలమాల డి. ద్విపద
13. శతకానికి ప్రత్యేక వ్యక్తిత్వం సమకూర్చి, పద్యాలన్నింటికి అంతర్వాహిని అయిన ఐక్యబంధాన్ని సమకూర్చేది?
ఎ. సంఖ్యానియమం బి. మక్కుట నియమం
సి. ఛందో నియమం డి. రసనియమం
14. శతకాన్ని ‘ముక్తకకావ్యం’ అనడానికి కారణం?
ఎ. ప్రతి పద్య చమత్కృతి బి. ప్రతి పద్యమంలో మకుటం
సి. ప్రతి పద్యం దేనికదే స్వతంత్రం
డి. ఆత్మాశ్రయమైన భావన
15. వేమన శతకంలోని పద్యాలన్నీ..?
ఎ. కందం బి. ఉత్పలమాల సి. తేటగీతి డి. ఆటవెలది
16. ‘ప్రజాకవి వేమన’పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన ఆధునిక కవి?
ఎ. ఆచార్య ఎన్.గోపి డి. డా.సి.నారాయణరెడ్డి
సి. ఆరుద్ర డి. ఆత్రేయ
17. తెలుగు శతక సాహిత్యంపై పరిశోధన చేసి, శతక లక్షణాలను సమగ్రంగా పరిశోలించి ‘ఆంధ్ర శతక సాహిత్య వికాసం’ గ్రంథం రాసిన వారు?
ఎ. వంగూరి సుబ్బారావు బి. డా||కె.గోపాలకృష్ణారావు
సి. ఆచార్య ఎన్.గోపి డి. వేటూరి ప్రభాకరశాస్త్రి
18. ‘భద్రగిరి శతకం’ గ్రంథకర్త?
ఎ. పార్థసారథిసెట్టి బి. తెన్నేటి నారాయణ శర్మ
సి. భల్లా పేరయ్య డి. కంచర్ల గోపన్న
19. కాసుల పురుషోత్తమ కవి సీసపద్యాల్లో రాసిన ‘ఆంధ్రనాయక శతకం’?
ఎ. దృష్టాంత శతకం బి. వ్యాజనిందశతకం
సి. వ్యాజస్తుతి శతకం డి. నీతి శతకం
20. ‘సింహాద్రి నరసింహా శతక’కర్త…?
ఎ. భల్లా పేరయ్య బి. పక్కి అప్పల నర్సయ్య
సి. వేదం వేంకటకృష్ణశర్మ డి. గోగుల పాటి కూర్మనాథకవి
21. శతక పద్యాల్లో
ఎ. తప్పకుండా 100 పద్యాలే ఉంటాయి
బి. వస్వైక్యత ఉండదు
సి. ఏకపాదమకుటం ఉండాలి.
డి. తెలుగులో శతక వాజ్ఞ్మయం ఆధునిక కాలంలో ప్రారంభమైంది.
22. ‘సిరిసిరి మువ్వ శతకం’ కృతికర్త
ఎ. శ్రీశ్రీ బి. ఆత్రేయ
సి. ఆరుద్ర డి.జాషువా
23. నింఘటువును శతకంగా రచించిన కవి?
ఎ.నార్ల వెంకటేశ్వరరావు బి. బేతవోలు రామ బ్రహ్మం
సి. గణవరపు వేంకటకవి
డి. కాసుల పురుషోత్తమకవి
24. జతపర్చుము
1. బోయిభీమన్న అ. టెంకాయ చిప్ప శతకం
2. విశ్వనాథ ఆ. అభినవ వేమన శతకం
3. బేతవాలు రామబ్రహ్మం ఇ. పిల్లి శతకం
4. వాలిలకొలను సుబ్బారావు ఈ. వరలక్ష్మీ త్రిశతి
1 2 3 4
ఎ. ఆ ఇ ఆ ఈ
బి. ఇ అ ఆ ఈ
సి. ఇ ఆ ఈ అ
డి. ఇ ఈ ఆ అ
25. శ్రీకాళహస్తీశ్వర శతకంలో కనిపించే అంశం?
ఎ. ఆత్మ నివేదన బి. రాజనిరసన సి. నిర్వాజభక్తి డి. ఎ, బి మరియు సి
26. 17వ శతాబ్దం ప్రారంభంలో కవి చౌడప్ప రాసిన ‘కవి చౌడప్ప శతకం’..?
ఎ. నీతి శతకం బి. శృంగార శతకం సి. అధిక్షేపశతకం డి. భక్తిశతకం
27. డా||సి.నారాయణరెడ్డి రాసిన శతకం ఏది?
ఎ. సినారె శతకం బి. సమదర్శనము సి. నీలకంఠశతకం డి. సిరిసిరిమువ్వశతకం
28. కాసుల పురుషోత్తమ కవి రాసిన శతకం/శతకాలు?
ఎ. హంసలదీవి వేణుగోపాలశతకం బి. మానస బోధ శతకం
సి. భక్త కల్పద్రుమ శతకం
డి. పైవన్నీ
29. జతపర్చుము
1.మృత్యుంజయ శతకం అ.కందుకూరి వీరేశలింగం
2.మార్కండేయ శతకం ఆ.చెళ్ళపల్లి వేంకటశాస్త్రి
3.మాతృశతకం ఇ.వడ్డాది సుబ్బారామకవి
4. భక్త చింతామణి శతకం ఈ.దువ్వూరి రామిరెడ్డి
1 2 3 4
ఎ. ఆ అ ఈ ఇ
బి. అ ఆ ఈ ఇ
సి. అ ఇ ఆ ఈ
డి. ఆ ఈ ఇ ఇ
30.’శతక కవుల చరిత్ర’ గ్రంథకర్త..?
ఎ.వేదం వెంకట కృష్ణశర్మ
బి. వంగూరి సుబ్బారావు
సి.కె.గోపాలకృష్ణరావు డి. కందుకూరి విరేశలింగం
31.’శతక వాజ్ఞ్మయ సర్వస్వం’ పరిశోధాత్మక గ్రంథం రాసింది..?
ఎ. వేదం వేంకట శృష్ణశర్మ
బి. వంగూరి సుబ్బారావు
సి. ఎనుగు లక్ష్మణకవి డి. కె.గోపాలకృష్ణరావు
32.తెలుగులో శతక వాజ్ఞ్మయం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది?
ఎ.14వ శతాబ్దము బి. 13వ శతాబ్దము
సి.12వ శతాబ్దము డి.11వ శతాబ్దము
33. ‘బసవా బసవా వృషాధిపా’ అనే మకుటం గల శతకం?
ఎ. శివతత్త్వ సారం
బి. బసవలింగ శతకం
సి. శివరాత్రి మహత్మ్యం
డి. వృషాధిప శతకం
34. తెలుగు సాహిత్యంలో మొదటగా శతక లక్షణాలున్న పద్యాలు ఏ గ్రంథంలో కనిపిస్తాయి?
ఎ. నన్నయ-భారతం బి. తిక్కన-భారతం
సి. ఎర్రన-భారతం డి. ఏదీకాదు
35. తెలుగు తొలి ప్రసిద్ధ నీతి శతకం ఏది?
ఎ. వేమన శతకం బి.భాస్కర శతకం
సి. సుమతీ శతకం డి. దాశరథీ శతకం
36. బిల్వేశ్వర శతక కర్త ఎవరు?
ఎ. మండపాక పార్వతీశ్వర శాస్త్రి బి. కొక్కొండ వేంకటరత్నం పంతులు
సి. రామప్రోలు సుబ్బారావు
డి. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
37. జతపర్చుము
1. హరిజన శతకం అ. మంగిపూడి వేంకటశర్మ
2. భక్త మందార శతకం ఆ. తిక్కన సోమయాజి
3. కృష్ణశతకం ఇ. కూచిమంచి జగ్గకవి
4. మహాత్మశతకం ఈ. కుసుమ ధర్మన
1 2 3 4
ఎ. ఈ అ ఇ ఆ
బి. ఈ అ ఆ ఇ
సి. ఈ ఇ ఆ అ
డి. ఇ ఈ ఆ అ
38. వ్యాజస్తుతి శతకాలకు ఉదాహరణ?
ఎ. సింహాద్రి నరసింహ శతకం
బి. భద్రగిరి శతకం
సి. రామలింగేశ్వర శతకం
డి. అన్నీ
39. సామినేని వేంకటాద్రి కవి రాసిన ‘చీపుర పుల్ల శతకం’?
ఎ. వ్యాజస్తుతి శతకం బి. వ్యాజ నింద శతకం
సి. భక్తి శతకం డి. హాస్య శతకం
40. మధుర భక్తి శృంగార ప్రధానమైన శతకం..?
ఎ. తాళ్ళపాక అన్నమయ్య వేంకటేశ్వర శతకం
బి. గోగుల పాటి కూర్మనాథుడు – సింహాద్రి నారసింహశతకం
సి. కంచెర్ల గోపన్న – దాశరథీశతకం
డి. ధూర్జటి – శ్రీకాళహస్తీశ్వర శతకం
41. మధ్యాక్కర ఛందస్సులో శతకం రాసిన కవి?
ఎ.నన్నయ బి. విశ్వనాథ సి.సినారె డి. రాళ్ళపల్లి
42. వేమనపై విమర్శ గ్రంథం రాసినవారు?
ఎ. రాళ్లపల్లి బి. సి.పి.బ్రౌన్
సి. వేటూరి డి. సినారె
సమాధానాలు
1. బి 2. సి 3. సి 4. బి 5. ఏ 6. డి 7. బి 8. సి 9. బి 10. ఏ 11. డి 12. సి 13. బి 14. సి 15. డి 16. ఏ 17. బి 18. సి 19. సి 20. డి 21. బి 22. ఏ 23. సి 24. డి 25. డి 26. సి 27. బి 28. డి 29. ఏ 30. బి 31. సి 32. సి 33. డి 34. ఏ 35. సి 36. బి 37. సి 38. డి 39. డి 40. ఏ 41. బి 42. ఏ
– నానాపురం నర్సింహులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా.
9030057994