ప్రజాకవి అక్షర యోధుడు కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా మండలం లోని మన్మద్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మల్కా గౌడ్, కాళోజి నారాయణ రావ్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజి రచనలు, బాల్యం, విద్యాభ్యాసం తెలంగాణ ఉద్యమాలలో కాలోజి పాత్ర, తెలంగాణ యాస యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు మాతృభాషపై పట్టు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలుగు భాష ఉపాధ్యాయులు మల్క గౌడ్ని పాఠశాల బృందం శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, దేవేందర్, రాజేందర్ రెడ్డి, నవీన్ కుమార్, రమాదేవి, విజయ కుమారి, సౌజన్య, గోదావరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు