మండలంలోని లింగాల గ్రామపంచాయతీ పరిధిలోగల కొడిశల, ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం కొడిశెల ప్రాథమికోన్నత ప్రధానోపాధ్యాయులు తోలెం దేవదాస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజాకవి అక్షర యోధుడు కాలోజి నారాయణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దేవదాస్ మాట్లాడుతూ.. కాళోజి రచనలు బాల్యం విద్యాభ్యాసం తెలంగాణ ఉద్యమాలలో కాళోజి పాత్ర, తెలంగాణ భాష, యాస యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు మాతృభాషపై పట్టు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలుగు భాష ఉపాధ్యాయుని పాఠశాల బృందం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్, జగపతిరావు, దేవులా, చొక్కా రావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, లక్ష్మయ్య, శేషు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.