భీంగల్ మండలం గోన్ గొప్పుల గ్రామంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో తొలి విగ్రహం గోన్ గోప్పులలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అంబేద్కర్ భావజాలన్ని పనికిపుచ్చుకొని తన జీవిత కాలం హక్కుల కోసం పోరాడిన నాయకుడు గద్దర్ అని, తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలుదిన గద్దర్ తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన విశిష్ట సేవలను గుర్తించి సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గద్దర్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.