ప్రజావాణి దరఖాస్తులు త్వరిగతిన పరిష్కరించాలి..

Prajavani applications should be resolved quickly.– ప్రజావాణికి 59 దరఖాస్తులు..
– ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి..మండలాల ప్రత్యేక 
– అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటనలు చేసి నివేదికలు అందించాలి..
– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ –  సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణి లో వచ్చే దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చే ప్రతి దరఖాస్తును ఎక్కువ రోజులు పెండింగ్ లో ఉంచకుండా వేగంగా ఖచ్చితమైన సమాధానం అర్జీ దారులకి చూపాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా అధికారులు అందరు తమ సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకునేవిధంగా చూడాలని ఒకవేళ సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయకపోతే సంబంధిత శాఖ జిల్లా అధికారి నే పూర్తి భాద్యత వహించాల్సి ఉంటుందని అలాగె సిబ్బంది అందరు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.మండలాలకి కేటాయించిన ప్రత్యేక అధికారులు తమ  మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నివేదికలు అందించాలని కలెక్టర్ సూచించారు.నేటి ప్రజావాణిలో భూ సమస్యలకి సంబందించి 20 దరఖాస్తులు, పంచాయతీ రాజ్ శాఖ కి సంబంధించి 7 దరఖాస్తులు, జిల్లా సంక్షేమ శాఖ కి సంబందించి 7 దరఖాస్తులు,డి ఆర్ డి ఎ కి సంబంధించి 5 దరఖాస్తులు, వ్యవసాయ శాఖ కి సంబందించి 4  దరఖాస్తులు, ఇతర శాఖ లకి సంబందించి 16 దరఖాస్తులు, మొత్తం 59  దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఎ వి వి అప్పారావు, ఇంచార్జి డి పి ఓ నారాయణ రెడ్డి, డి ఎ ఓ శ్రీధర్ రెడ్డి, డి యం హెచ్ ఓ కోటాచలం, డి టి డి ఓ శంకర్, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.