ప్రజావాణి దరఖాస్తులను త్వరత గతిన  పరిష్కరించాలి…

నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్ 
ప్రజావాణిలో వచ్చిన  దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరిత గతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో  వివిధ ప్రాంతాల   ప్రజల నుండి వచ్చిన 30 దరఖాస్తులను స్వీకరించారు.  అందులో రెవిన్యూ శాఖ 17, జిల్లా పంచాయతీ అధికారి 2, జిల్లా ఎంప్లాయిమెంట్  2, జిల్లా గ్రామీణ అభివృద్ధి  2,  డిఇఇ హౌసింగ్, చేనేత వ్యవసాయ శాఖ, పోలీస్, జిల్లా కో-ఆపరేటివ్,ఇఇ వాటర్ వర్క్స్ , వైద్య ఆరోగ్య  నుండి ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ కార్యక్రమంలో   జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జగన్మోహన్ ప్రసాద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.