ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: అదుపు కలెక్టర్లు

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్లు బెన్ షాలోమ్, కే గంగాధర్ లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించి, ప్రజల స్వీకరించి, మాట్లాడారు. బుదాన్ పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామానికి చెందిన రంగ అండాలు తమకు పంపి చేయాలను కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సర్వే నెంబర్ 438 /42 లో ఒక ఎకరం 20 గుంటల భూమి ఉందని, తన భర్త చనిపోయిన తర్వాత తనకు పౌతి చేయాలని 2017 సంవత్సరం నుంచి దరఖాస్తు చేసుకున్న ఫలితం లేదని వాపోయారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరారు.
యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామం లో ముస్లింలకు కబురస్థాన్ కోసం ఎగరం భూమిని కేటాయించాలని కోరారు. సర్వే నెంబర్ 423/62 లో ఎకరం భూమి ఒక వ్యక్తి పేరు ఉందని, ఆ వ్యక్తి పేరును తొలగించాలని, అతని సమాధి పత్రాన్ని సమర్పించినట్లు , ఆ భూమిని ముస్లింల కబరస్థాన్ కోసం బదిలీ చేయాలని కోరారు.  భువనగిరి మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన బి రాజమల్లయ్య తనకున్న మూడెకరాల భూమిని తన కుమారులకు బదిలీ చేయగా, ప్రస్తుత వారు తమ చూడడం లేదని, తమకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్ వినతిపత్రంలో వాపోయారు. భువనగిరి రైతు బజార్లో ఉల్లిగడ్డ , టమాట, అల్లం, గోధుమలు, సన్న బియ్యం మంచి నూనె పంచదార ఇతర  నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని కోరుతూ కాంగ్రెస్ కమిటీ మైనార్టీ డిపార్ట్మెంట్ స్టేట్ కోఆర్డినేటర్ మహమ్మద్ షరీఫ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కాగా  ప్రజల నుంచి 59 దరఖాస్తుల స్వీకరించినట్లు తెలిపారు. రెవిన్యూ శాఖ 39, గ్రామీణ అభివృద్ధి శాఖ ఐదు, విద్యాశాఖ నాలుగు, సర్వే ల్యాండ్ రికార్డు 2, అడవి శాఖ రెండు, విద్యుత్ శాఖ రెండు, పోలీసు పంచాయతీరాజ్ ఆర్ డబ్ల్యు సీడ్ బ్యాక్ మేనేజర్ మున్సిపాలిటీ శాఖలకు ఒక్కొక్కటి చోప్పున దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.