– కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ : పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 18 న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు అనగా జూన్ 6, వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా ప్రజలు ప్రతి సోమవారం వినతులను సమర్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.