నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిస్కారం చేయడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా మండల తహశీల్దార్ రవికుమార్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్నీ నిర్వహించినట్లుగా తెలిపారు. నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 13 దరఖాస్తులు వచ్చినట్లుగా పేర్కొన్నారు.భూ సమస్యలపై 10,నూతన రేషన్ కార్డుల కోసం 3 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.