ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో లోక్ సభ ఎన్నికలు నేపథ్యంలో జిల్లాలో  కోడ్ అమలులో ఉన్నందున, జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో  పాల్గొనున్నారు అని,ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి  సహాకరించ వలసిందిగా కోరారు.