నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా ప్రతి సోమవారం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని, రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ యొక్క విజ్ఞప్తులు, ఫిర్యాదులను అందించవచ్చునని తెలిపారు.