– గండిపేట్ మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా
– నార్సింగి కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ-గండిపేట్
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి టి.ప్రకాష్ గౌడ్‌ను మరోసారి గెలిపించేందుకు కృషి చేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షులు రామేశ్వరం నర్సింహా తెలిపారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీలో బూత్ లేవల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్‌లో బీఆర్‌ఎస్ గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ చేపట్టిన పథకాలు, పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలను సైతం ప్రజలకు వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ వెంకటేష్‌యాదవ్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, శివారెడ్డి, పత్తి శ్రీకాంత్‌రావ్, పత్తి ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులు పత్తి రాజు, కమలపల్లి విష్ణువర్థన్‌రెడ్డి, మండల మహిళాధ్యక్షురాలు పత్తి శోభరాణి, మున్సిపల్ అధ్యక్షురాలు ప్రియదర్శిని, మహిళలు జయమ్మ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.