నవతెలంగాణ: రెంజల్ : రెంజల్ మండలం వీరన్న గుట్ట, వీరన్న గుద్ధ తండాలో ఉన్న మూడు అంగన్వాడి కేంద్రాలను ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి సందర్శించి చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్రీ స్కూల్ కరికులం వర్క్ బుక్స్ గురించి వివరించడం జరిగింది. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రం వద్ద ఆకుకూరలు కాయగూరలు పండించాలని ఆమె సూచించారు. నూతనంగా అంగన్వాడీల చేరిన చిన్నారులకు అక్షరభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు విజయలక్ష్మి శాంత, బి . ఆయాలు గర్భిణీ బాలింత మహిళలు పాల్గొన్నారు