నానమ్మ పెంచిన ప్రాణాలే..

The life raised by my grandmother..నేనో సీతాకోకచిలుక నై..
నా బాల్యపు స్మతులను..
నా బ్రెయిన్‌ మెమోరీ కార్డులో వెతకగా..
అసూయ, కోపం, స్వార్థం లేని
పసిప్రాయం ఎంత బాగుందో..!
ఆకాశంలో నక్షత్రాలను చూపిస్తూ
మా తాత చెప్పిన నేతాజీ కథ ఎంత బాగుందో..!
మా నాన్న నేర్పిన ధైర్యపు ఆదర్శం ఎంత బాగుందో..!
మాకు అన్నం పెట్టి, ఆకలితో నిద్రించిన
మా అమ్మ ప్రేమ ఎంత బాగుందో..!
గోటిలాట, క్రికెట్‌ ఆటలో గొడవపడిన
మా తమ్ముళ్ల చిలిపితనం ఎంతబాగుందో..!
నా నాన్నమ్మ పెంచిన ప్రాణాలే
నాలోని అక్షరాలై.. నా బాహ్య బలమై..
భారతీయ తాత్వికుడుగా
భౌతిక శాస్త్ర ప్రేమికుడిగా
మారిన విధానం ఎంత బాగుందో..!
బాల్యమే బాగుంది.
మళ్ళీ మళ్ళీ రానంది..!
నా మనసేమో మళ్ళీ ఓసారి రమ్మంటోంది..!
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌,
9394749536