క్వార్టర్స్‌లో ప్రణయ్

– పారుపల్లి కశ్యప్‌ ఓటమి
– తైపీ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
తైపీ (చైనీస్‌ తైపీ) : భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ఆటగాడు హెచ్‌.ఎస్‌ ప్రణయ్ జోరు కొనసాగుతుంది. గురువారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో అలవోక విజయం సాధించిన వరల్డ్‌ నం.9 ప్రణరు.. తైపీ ఓపెన్‌ 2023 క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్స్‌లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగారిటో నుంచి ప్రణరుకి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. 21-9, 21-17తో వరుస గేముల్లోనే గెలుపొందాడు. 39 నిమిషాల్లోనే క్వార్టర్స్‌ బెర్త్‌ దక్కించుకున్న మూడో సీడ్‌ ప్రణరు.. మలేషియా ఓపెన్‌ తర్వాత మరో సూపర్‌ 300 టైటిల్‌పై కన్నేశాడు. నేడు జరిగే క్వార్టర్‌ఫైనల్‌ పోరులో హాంగ్‌కాంగ్‌ షట్లర్‌, ఐదో స ఈడ్‌ ఆంగస్‌ లాంగ్‌తో ప్రణరు పోటీపడనున్నాడు. కామన్‌వెల్త్‌ క్రీడల మాజీ చాంపియన్‌ పారుపల్లి కశ్యప్‌ పతక ఆశలకు తెరపడింది. ప్రీ క్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీ షట్లర్‌ చేతిలో 16-21, 17-21తో కశ్యప్‌ పరాజయం పాలయ్యాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి, రోహన్‌ కపూర్‌ జోడీ సైతం 13-21, 18-21తో ఓటమి చెందింది. మహిళల సింగిల్స్‌లో తానియా కామత్‌ 11-21, 6-21తో ఒలింపిక్‌ సిల్వర్‌ మెడలిస్ట తైజుయింగ్‌ చేతిలో మట్టికరిచింది. తైపీ ఓపెన్‌లో భారత ఆశలన్నీ ప్రస్తుతం హెచ్‌.ఎస్‌ ప్రణరుపైనే ఉన్నాయి.