ప్రణయ గోదారి..

ప్రణయ
గోదారి..హాస్య నటుడు అలీ సోదరుడి కుమారుడు సదన్‌ హీరోగా, ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ఈ చిత్రానికి పి.ఎల్‌.విఘ్నేష్‌ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను సంఘ సేవకులు అంబర్‌ పేట్‌ శంకరన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘చిన్న చిత్రాలకు సినీ పరిశ్రమలోని అందరూ అండగా నిలవాలి. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. నిర్మాతగా పారమళ్ల లింగయ్యకు ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్‌తో పాటు, డబ్బులు కూడా రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని అన్నారు.. ‘నాకెంతో ఇష్టమైన అంబర్‌ పేట్‌ శంకరన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని నిర్మాత పారమళ్ళ లింగయ్య చెప్పారు.