రోడ్డు ప్రమాదాల నివారణకై పసర పోలీస్ స్టేషన్ సిఐ రవీందర్ మరియు ఎస్ఐ కమలాకర్ లు శుక్రవారం పలు వాహనాలకు రేడియం స్టిక్కర్లను అంటించారు.
ఈ సందర్భంగా సి ఐ రవీందర్ ఏస్ ఐ కమలాకర్ లు ప్రజలతో మాట్లాడుతూ రోడ్డు మీద ట్రాక్టర్లు ఇతర వాహనాలు ఆగి ఉన్నపుడు అవి కనిపించక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం సంభవిస్తుండటంతో వాటిని నివారించాలని ఉద్దేశంతో పసర నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన గద్ద రవీందర్, విన్నూతంగా ఆలోచించి పసర ఎస్సై కమలాకర్ తో కలిసి మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో ట్రాక్టర్లు అన్నిటికి రేడియం స్టీక్కర్లు అంటివ్వటం జరిగింది. తద్వారా రాత్రి పూట వాహనం ఆగి ఉన్న వెనుక నుండి వస్తున్న వాహనాలు వాటిని గుర్తించి ప్రమాదం జరుగు అవకాశంను తగ్గించవచ్చు అన్నారు.సీఐ రవీందర్ తీసుకున్న ఈ మంచి ఆలోచనకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.