ప్రసాద్‌కుమార్‌కు బ్రహ్మరథం నియోజకవర్గంలో

– కొనసాగుతున్న హస్తం జోరు
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
వికారాబాద్‌ నియోజకవర్గంలో హస్తం జోరు కొనసాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి గ డ్డం ప్రసాద్‌ కుమార్‌ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌ మండ లం సిద్దులూరు, కొటాల గూడెం పీరంపల్లి, పులుసు మామిడి, పాతూరు కామారెడ్డిగూడా, బురాన్‌పల్లి, గొట్టిముక్కుల, యాచారం గ్రామాల్లో ఆయన ప్రచారం కొనసాగింది. వికారాబాద్‌ మండలం కోటాలగూడెం, పీరంపల్లి గ్రామాలలో గడ్డం ప్రసాద్‌ కుమార్‌కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను బొంద పెడితేనే తెలంగాణకు మంచి రోజులు వస్తాయని అన్నారు. హామీలు బారెడు చేతలు మూరెడు అన్న చందంగా ప్రజలను మోసం చేస్తూ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని గులాబీ నాయకులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి మాటలను నమ్మొద్దని సూచించారు. చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. కోటమర్పల్లి గ్రామంలో గడ్డం ప్రసాద్‌కుమార్‌ కూతురు అనన్య ప్రచారం నిర్వహించారు.