సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ నాయకుడు ప్రసాద్ శనివారం అందజేశారు. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రూరల్ ఎమ్మెల్యే ఆదేశానుసారం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్కు సహకరించిన రూరల్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.