మండల కేంద్రంలోని పున ప్రసాద్ అనే వ్యక్తిని, వరి కుటుంబాన్ని మెడిడ ప్రశాంత్ అనే వ్యక్తి రోజుకు ఒక్కరి చొప్పున హత్య చేసిన సంఘటన తెలిసిందే. అందులో ప్రసాద్ ను గత నెల 29న హత్య చేసి పూడ్చి వేసినట్లు ప్రశాంత్ ఉప్పుకున్నడు. ప్రసాద్ శవాన్ని గురువారం పోలీసులు వెలికి తీసి పంచనామా నిర్వహించారు. అనంతరం అక్కడే పూడ్చి వేశారు. ప్రసాద్ బార్య రమణిని బాసర నదిలో పడేయటంతో ఆమె శవం దొరకలేదని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సతీష్, ఎస్సై సుదీర్ రావు, సిబ్బంది, మృతుని బంధువులు ఉన్నారు.