నవతెలంగాణ- భీంగల్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపు కోరుతూ పట్టణంలోని 5, 6 వార్డుల్లోని 164, 165 బూత్ లకు చెందిన సుమారు 200 మంది యువకులు లింబాద్రి గుట్ట కు పాదయాత్ర గా వెళ్లారు. పట్టణం లోని నందిగల్లీ మీదుగా ముచ్కూర్ చౌరస్తా, పురాణిపేట్ నుండి కొండపై వరకు పాద యాత్ర కొనసాగింది. దారి పొడవునా ప్రశాంత్ రెడ్డి జిందాబాద్, కారు గుర్తుకు ఓటు వేయాలి అనే నినాదాలు చేశారు. కొండపైకి చేరుకున్న యూత్ సభ్యులు మెట్ల మార్గం ద్వారా గర్భాలయం లో కొలువైన శ్రీ లక్మీ నరసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి స్వామి మూడో సారి విజయం అందించి ఆశీర్వదించాలని వేడుకున్నారు. పట్టణ, నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రశాంత్ రెడ్డి కి స్వామి దయతో గెలిపించుకునే బాధ్యత యువత తీసుకుంటుందని, అందుకొరకు మిగిలిన రోజులు యువత ఆధ్వర్యంలో శ్రమపడి ప్రచారం ముమ్మరం చేసి విజయం సాధిస్తామని యువకులు ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసిన మంత్రి వేముల కు శ్రీ లక్మీ నరసింహుని ఆశీస్సులతో పాటు ప్రజల అండదండలు ఉంటాయన్నారు. పాదయాత్ర లు 200 యువకులు పాల్గొన్నారు. స్వామి కళ్యాణం రోజున మంత్రి వేముల విజయం కోరుతూ చేసిన పాదయాత్ర ద్వారా విజయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.