హైదరాబాద్ : హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) 32వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్లను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన ఫస్ట్సోర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీ సర్‌గా ఉన్నారు. 2024-26 కాలానికి హైసియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇంత క్రితం ఆయన అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇన్ఫోసిస్ హైదరాబాద్ (సెజ్) అండ్ ఇండోర్ క్యాంపస్ హెడ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ హెడ్ మనీషా సాబూ నుంచి కొత్త బాధ్యతలను స్వీకరించారు. నూతన వైస్ ప్రెసిడెంట్‌గా బిపిన్ పెండ్యాల, ట్రెజరర్‌గా ఐజాక్ రాజ్ కుమార్, జనరల్ సెక్రటరీగా రామకృష్ణ లింగిరెడ్డి, జాయింట్ సెక్రటరీగా వినరు అగర్వాల్ నియమతులయ్యారు.