అమెరికా ఫార్మ్స్ సందర్శించిన ప్రశాంత్ రెడ్డి

– పంటల ఆధునిక సాగు తీరు పరిశీలిలన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నో స్టేట్ యూనివర్శిటీ ఫార్మ్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం సందర్శించారు. పంటల ఆధునిక సాగు తీరును ఆయన పరిశీలించారు.ఈ ఫార్మ్ లో  స్వీట్ కార్న్ (తెల్ల మొక్కజొన్న) ఎల్లో కార్న్ (పసుపు మొక్క జొన్న) ఆల్మాండ్ (బాదం), పార్సీ మోన్ పండ్ల తోటల ఆధునిక  సాగు తీరును ఆ ఫార్మ్  డీన్ అయిన విన్స్ రోస్ ను ప్రశాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థానికురాలు క్యాండీస్, నిరజా రెడ్డి, నరేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.