ప్రతిభ అనే క్రీడాకారిణికి ప్రోత్సాహకం అందించాలి: ఎమ్మెల్యే

Pratibha sportsperson should be encouraged: MLAనవతెలంగాణ – మద్నూర్ 
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం నాడు  అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   తెలంగాణకు చెందిన క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరీన్ మరియు క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ లకు ఇచ్చిన గుర్తింపు పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ.. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ప్రతిభ అనే క్రీడాకారిణి వివిధ క్రీడలలో రాణిస్తున్నదని గుర్తు చేశారు. ఈమధ్య కోల్ కతాలో జరిగిన ఇండియా & ఏషియన్ చెస్, బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఐదు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించిందని, రెండు వరల్డ్ ఛాంపియన్ షిప్స్ కూడా సాధించిందని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క స్టేడియం గానీ కనీస క్రీడా సౌకర్యాలు లేకపోయినప్పటికీ ఆమె ఇంత అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుందని తెలిపారు.కాబట్టి ప్రభుత్వం తరపున ప్రతిభకు ప్రోత్సాహకం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.