నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ నూతన కలెక్టర్‌గా ప్రతిక్‌జైన్ ఆది వారం బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం వికా రాబాద్ కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఇప్పటి వరకు పని చేసి బదిలీపై వెళుతున్న సి.నారా యణరెడ్డి నుంచి నూతన కలెక్టర్‌గా ప్రతిక్‌జైన్ బా ధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ వికారాబాద్ జిల్లాను అన్నిరంగాల్లో అభి వృద్ధి చేసేందుకు అందరూ సహకరించాలన్నా రు. అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకా రంతో జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామ న్నారు. తనుకు జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎస్‌లకు ఈ సందర్భంగా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
కలెక్టర్ నేపథ్యం: ప్రస్తుత వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్‌జైన్ ఢిల్లీలో జన్మించారు. తన విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోని దయానంద విహార్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. 2009 సంవత్సరం నుండి 2013 సంవత్సరం వరకు ఐఐటి బీటెక్ త్రిబుల్ ఈఈఈ కోర్సు గౌహతిలో పూర్తి చేశారు. అలాగే 2017 నుంచి 2019 వరకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం రాసిన పరీక్షలో ఇండియాలో 88ర్యాంక్ సాధించారు. మే 2018 నుంచి జూలై 2019 వరకు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. జూలై 2019 నుంచి అక్టోబర్ 2019 వరకు జల శక్తి మినిస్టరీ దగ్గర అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. 9వ తేదీ ఫిబ్రవరి 2020 రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం పదోన్నతిపై భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గా పనిచేశారు. ప్రస్తుతం వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
శుభాకాంక్షల వెల్లువ: వికారాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ప్రతిక్‌జైన్‌కు జిల్లా అధికారులతోపాటు పలు వురు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ లిం గ్యానాయక్, ఆర్డీఓలు వాసుచంద్ర, శ్రీనివాసులు, అన్ని శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు , సిబ్బంది కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.