దేవి నవరాత్రుల్లో ప్రతినిత్యం అన్నదానం 

Pratinityam Annadanam in Devi Navratriనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని చింతలూరు గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నర్వహించినట్లు కొలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. గ్రామంలోని ముదిరాజ్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన దుర్గామాత మండపం వద్ద తొమ్మిది రోజుల నుంచి అన్నదాన కార్యక్రమము నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. తొమ్మిది రోజులుగా గ్రామంలోని ప్రజలందరూ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.