పట్టణంలో ప్రవాస యోజన కార్యక్రమం

నవతెలంగాణ -ఆర్మూర్
పట్టణ కెద్రంలో క్షత్రియ ఫంక్షన్ హల్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రవస యోజన కార్యక్రమం గురువారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ధ్యాగా ఉదయ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి విచ్చేశారు.బీజేపీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి  తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావడం కూడా అవసరం డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి చెందుతుంది అని ఆర్మూర్ లో మాత్రం ప్రభుత్వం కాకుండా వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం నడుస్తుంది అని ఈ అరాచకం అరికట్టేందుకు బీజేపీకి ఓటు వేయాలని అని అన్నారు.రాకెష్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి ఎమ్మెల్యేలో ఆర్మూర్ ప్రథమ స్థానం ఉంది అని అవినీతి ఎమ్మెల్యేకి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కబ్జా చేస్తూ షాపింగ్ మాల్ వందల ఎకరాల భూములు కొంటున్నాడు అని,ప్రశిస్తే అక్రమ కేసులు చేస్తూ ఆనందం పొందుతున్న వ్యక్తి ఎమ్మెల్యే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాలెపు రాజు,అదిలాబాద్ ఇంచార్జి అల్జాపూర్ శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నుతుల శ్రీను, శివరాజ్, బీసీ మోర్చా అధ్యక్షుడు యమాద్రి భాస్కర్, కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు..