నూతన ఎంపీడీఓగా ప్రవీన్..

Praveen as the new MPDO..– శాలువా కప్పి ఘన స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది
– లక్ష్మప్పకు ఘన వీడ్కోలు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కే.ప్రవీన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ మండలం ఎంపీడీఓగా పని చేసి మండల ఎంపీడీఓ బదిలీపై వచ్చారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీఓ ప్రవీన్ కు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మప్పను సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.సూపరిండెంట్ అంజయ్య, సీనియర్ అసిస్టేంట్ రాధ కిషన్,జూనియర్ అసిస్టెంట్లు ప్రకాశ్ నారాయణ,సతీశ్ రెడ్డి, బాలయ్య, ఈ పంచాయితీ సిబ్బంది బోనగిరి సాగర్,ప్రసన్న, లక్ష్మన్,పంచాయితీ ప్రనీత్ రెడ్డి,సిబ్బంది శంకర్, శ్రీనివాస్ రెడ్డి,కుమార్ పాల్గొన్నారు.