నవతెలంగాణ- ఆర్మూర్
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ యాత్ర కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ బుధవారం బిజెపి ఆధ్వర్యంలో ఆలూర్ రోడ్డు వద్ద దార్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రార్థనలు నిర్వహించినారు.. ఈ యొక్క ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్ 3 కార్యక్రమం విజయవంతం అయితే చంద్రుడిపై భారత మువ్వన్నెల జెండా ఎగిరి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని. ఓ గర్వకారణం అయినటువంటి కార్యాన్ని సాధించినటువంటి దేశంగా ప్రపంచ దేశాల్లో ఒక దేశంగా చరిత్ర సృష్టిస్తుందని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర వనీ శాసనసభ్యులు సంజీవరెడ్డి బాబురావు, బిజెపి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, కార్యవర్గ సభ్యులు కృష్ణ గౌడ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్, పట్టణ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వర్, పాన్ శీను, మత్స్య సెల్ కన్వీనర్ భవాని పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.