రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్ధనలు

నవతెలంగాణ – నసురుల్లాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో, కేసీఆర్, స్పీకర్ పోచారం అధిక మెజారిటీ తో గెలవాలని కోరుతూ బుధవారం నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ తమాస్ మాట్లాడుతూ గడచిన 9 ఏండ్లల్లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగాలని, బాన్సువాడ నియోజకవర్గం ఎనలేని అభివృద్ధి చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయూరోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటూ అత్యధికంగా మెజార్టీతో గెలవాలని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి సమానంగా ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు ఉన్నారు.