– పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు ఆదరాసుపల్లి శశిధర్ శర్మ
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పి ఆర్ సి ఫిట్మెంట్ 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు ఆదరాసుపల్లి శశిధర్ శర్మ అన్నారు బుధవారం హుస్నాబాద్ లోని పలు పాఠశాలలో సభ్యత నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వచ్చే మాసంలో డీఎస్సీ అపాయింట్మెంట్స్ కన్న ముందే జిల్లాలో రేషన్లైజేషన్ చేయాలని జిల్లా శాఖ పక్షాన కోరారు. జీవో నెంబర్ 11, 12 సవరించి బిఈడి అర్వత కలిగిన ఉపాధ్యాయుల కు పిఎస్ హెచ్ఎం పోస్ట్లు కల్పించాలని, పదివేల పిఎస్ హెచ్ఎం పోస్టులు ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు. అంతే కాకుండా ఫిట్మెంట్ 50% పిఆర్సి ఇవ్వాలి ,ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ వెంటనే క్లియర్ చేయాలని, ఇప్పటికి పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు పంజా రాజమల్లు ,ప్రధాన కార్యదర్శి ప్రతాప రాజయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కొలువురు తిరుపతిరెడ్డి, రాష్ట్ర నాయకులు రెమెడీ లింగారెడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.