భయంతోనే ముందస్తు అరెస్ట్ 

Pre-arrest due to fear
నవతెలంగాణ – బొమ్మలరామారం 
భయంతోనే సీఎం రేవంత్ ముందస్తు అక్రమ అరెస్టులు చేశారని. బీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు ధీరావత్ బాల్ సింగ్ నాయక్ అన్నారు. సోమవారంనిరుద్యోగులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతుంటే అక్రమ అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి మానుక రాజు యాదవ్,  బాధిని నిఖిల్ గౌడ్,ఆడిజెర్ల వెంకటేష్, మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ దిరావత్ లక్ష్మణ్. మోతే మధన్. తదితరు నాయకులు పాల్గొన్నారు.