బెంగళూరు : ప్రస్తుత పండుగ సీజన్‌లో కొనుగోలుదారుల కోసం అమెజాన్ ఫ్యాషన్‌లో ప్రీ-ఫెస్టివ్ ఆఫర్‌లను అందిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆకర్షణీయంగా ఉండేందుకు కుర్తాలు, కుర్తా సెట్‌లు, చొక్కాలు, చీరలు, లెహంగాలు, మేకప్, స్కిన్ కేర్ మొదలైనవాటిని ఎంచుకోవచ్చని పేర్కొంది. ఫ్యాషన్ ఔత్సాహికులు తమ పండుగకు ముందు సన్నాహాలను మరింత పెంచుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం అమేజాన్ ఫ్యాషన్ ‘ది ఎత్నిక్ వీక్’ యొక్క మూడవ ఎడిషన్‌ను సెప్టెంబర్ 8 నుండి 12 వరకు నిర్వహిస్తోన్నట్లు వెల్లడించింది. పలు బ్రాండ్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ను కల్పిస్తోన్నట్లు పేర్కొంది.