పూర్వ ప్రాథమిక విద్య అందించాలి

పూర్వ ప్రాథమిక విద్య అందించాలినవతెలంగాణ-పెంచికల్‌పేట్‌
పూర్వ ప్రాథమిక విద్యను గ్రామాల్లో చిన్నారులకు అందే విధంగా అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేయాలని సీడీపీఓ విజయలక్ష్మీ అన్నారు. మండల కేంద్రంలోని సంజీవనగర్‌ అంగన్‌వాడీ కేంద్రం నుండి అమ్మమాట అంగన్‌వాడీ బాట అనే కార్యక్రమం ద్వారా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన పూర్త్తి ప్రాథమిక విద్యను అందించాలని, చిన్నారుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. కేంద్రాలకు హాజరైన చిన్నారులకు ఆటపాటల ద్వారా చిన్నారులను ఎలా ఆకట్టుకోవాలో అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. ఈ నెల 20 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ హసీనా, అంగన్‌వాడీ టీచర్లు చంద్రకళ, ఉపాధ్యాయులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
వాంకిడి : మండల కేంద్రంలో ఐసీడీఎస్‌ సీడీపీఓ రెబిక ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15 నుండి 20వ తేదీ వరకు అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించే బాధ్యత అంగన్‌వాడీ టీచర్లపై ఉందన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.