– ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానించాలి
– టీపీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పూర్వ ప్రాథమిక తరగతులను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానించాలనీ, తరగతికి ఒక గదిని, ఒక ఉపాధ్యాయుడిని నియమించాలనీ, అంగన్ వాడీ వారికి బోధనేతర పనులను అప్పజెప్పాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.అశోక్ కుమార్, పి.నాగిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలనీ, పాఠశాలల్లో పారిశుద్య కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. బదిలీ అయిన ఉపాద్యాయులందరినీ వెంటనే రిలివ్ చేయాలనీ, సాంకేతిక కారణాలు, ఆప్షన్స్‌లో తప్పిదాల జరిగిన ఉపాధ్యాయుల ఆప్పీల్స్ ను పరిష్కరించాలని కోరారు.