ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్‌

as the chief guest Pre releaseఅభయ్ నవీన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్‌’. ఎంటర్‌టైనింగ్‌ పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్‌ ఫ్లై ఆర్ట్స్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు యువ కథానాయకుడు విశ్వక్‌ సేన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా హీరో సిద్ధార్థ్‌ చేతుల మీదుగా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ‘బలగం’ వంటి సహజమైన మన నేటివ్‌ కథలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రానికి ఎడిటర్‌ : రూపక్‌ రొనాల్డ్‌ సన్‌, అభరు నవీన్‌, సంగీతం : కమ్రాన్‌, సినిమాటోగ్రఫీ : ఫహాద్‌ అబ్దుల్‌ మజీద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ ఎంఎస్‌ కే.