ప్రీ వెడ్డింగ్‌ ప్రసాద్‌

Pre wedding Prasadడెక్కన్‌ డ్రీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై నబీషేక్‌ నిర్మాణంలో ప్రొడక్షన్‌ నెం3గా రూపొం దనున్న చిత్రం ‘ప్రీవెడ్డింగ్‌ ప్రసాద్‌’. ఈ సినిమా శుక్రవారం పూజతో ప్రారంభమైంది. ‘జబర్‌దస్త్‌’, ‘బిగ్‌ బాస్‌’ షోలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అవి నాష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. రాకేష్‌ దుబాసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముహూర్త సన్నివేశానికి దర్శకుడు కోదండ రామిరెడ్డి క్లాప్‌ నివ్వగా, కోన వెంకట్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. దర్శకుడు సాయి రాజేష్‌ సినిమా టైటిల్‌ లోగోని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత నబి షేక్‌ మాట్లాడుతూ,’ఈ కథ అద్భుతంగా ఉంటుంది. స్క్రీన్‌ ప్లే, సన్నివేశాలు చాలా వైవిధ్యంగా, ఊహాతీతంగా ఉంటాయి. ఇందులో అవి నాష్‌నే ఎందుకు హీరోగా తీసుకున్నామో సినిమా చూస్తున్న ప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు.