కీటక జనత వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు

– గుత్తి కోయ గూడెంలలో ఇండోర్ స్ప్రే
– మలేరియా, టీబీ, ఎయిడ్స్ జిల్లా అధికారి పోరిక రవీందర్
నవతెలంగాణ – తాడ్వాయి
డెంగ్యూ మలేరియా తదితర కీటక జనిత వ్యాధులు సంక్రమించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మలేరియా, టీబీ, ఎయిడ్స్, బ్లడ్ బ్యాంక్ జిల్లా అధికారి డాక్టర్ పోరిక రవీందర్ అన్నారు. బుధవారం మండలంలోని మొండాలతోగు, కొండాయి గుత్తి గోయ ఆదివాసి గుడాలను సందర్శించి పరిశీలించారు. ఆ గ్రామంలో జరుగుతున్న ఇండోర్ స్ప్రే నీ పరిశీలించారు. ఈ సందర్భంగా మలేరియా, టీబీ, ఎయిడ్స్, బ్లడ్ బ్యాంక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో కీటక జీవితం వ్యాధుల సోకుండా క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించాలని, నిర్లక్ష్యం పై ఇస్తే ఉపేక్షించేది లేదన్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో మలేరియా నివారణకు వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేయాలని, వైద్య సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను నెలకు ఆరు పర్యాయాలు సందర్శించాలన్నారు. అలాగే దోమల ఉత్పత్తి కనుకూలంగా నీటినిలు లేకుండా తగిన చర్యలు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. దోమతెరల వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు కీటక జనిత మలేరియా డెంగ్యూ వ్యాధులు ఈ విధంగా సంక్రమిస్తాయి, నివారణ చర్యలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ స్వాతి, డీపీఎంఓ సంజీవరావు, హెల్త్ సూపర్వైజర్ లువంగేటి మోహన్ రెడ్డి, ఖలీల్, ఎన్ఎంలు అల్లెం మంగ, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.