దోమల బారిన పడకుండా జాగ్రత్తలు..

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని కాటేపల్లి తాండ గ్రామంలో బుధవారం పారిశుధ్య పనులు కొనసాగించారు.ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శి సుదీర్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుండి గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయటం జరిగిందని, దోమల నివారణకు దోమల మందు పిచికారి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.